ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మల్టీ స్టారర్ మూవీ టైటిల్ ఇదే!

Tue, Mar 15, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
మంచు విష్ణు .. రాజ్ తరుణ్ కథానాయకులుగా ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'క్యారీ ఆన్ జట్టా' అనే పంజాబీ మూవీకి ఇది రీమేక్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు సరసన సోనారిక .. రాజ్ తరుణ్ జోడీగా హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి, టైటిల్ ఏమైవుంటుందా? అనే విషయంపై అభిమానులు ఆసక్తిని చూపుతూ వస్తున్నారు.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'వీడు అదో టైపు .. వాడు మరో టైపు' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. టైటిల్ ను బట్టే ఇది సరదాగా .. సందడిగా సాగిపోయే కథాంశమని తెలుస్తోంది. అటు విష్ణుకి .. ఇటు తాజ్ తరుణ్ .. హెబ్బా పటేల్ కి యూత్ లో మంచి క్రేజ్ వుంది. అది ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుందని భావిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 14న విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)