ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రేమలో పడలేదంటోన్న హన్సిక!

Sun, Mar 13, 2016
హన్సిక
హన్సిక
హన్సిక గ్లామర్ ఆమెను కథానాయికగా మారిస్తే, అభినయం ఆమెను అగ్రస్థానానికి చేర్చింది. తెలుగు .. తమిళం భాషల్లో హన్సికకి ఎంతో క్రేజ్ వుంది. అలాంటి హన్సిక .. శింబు ప్రేమలో పడిందనే వార్తలు ఆ మధ్య జోరుగా షికారు చేశాయి. ఆ తరువాత కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అసలు ప్రేమలో పడితేనే గదా .. విడిపోవడానికంటూ హన్సిక అందరికీ షాక్ ఇస్తోంది.

శింబు కథానాయకుడిగా 'ఇదునమ్మఆళు' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా చేయమని అడిగితే హన్సిక ఒప్పుకోలేదనీ .. శింబుతో వ్యవహారం చెడటమే అందుకు కారణమని అనుకుంటున్నారు. అసలా సినిమాలో చేయమని తనని ఎవరూ అడగలేదని హన్సిక చెబుతోంది. తాను ఎవరినీ ప్రేమించడం లేదనీ .. అందువలన గొడవలకి ఆస్కారం లేదని అంటోంది. స్కూల్ డేస్ లో ఒక కుర్రాడు తనకి 'ఐ లవ్ యూ' చెప్పాడనీ, ఆ తరువాత ఎవరి నుంచి తాను ఆ మాట వినడం జరగలేదని సెలవిచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)