ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు!

Sun, Mar 13, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'నాన్నకు ప్రేమతో' సినిమాకి లభించిన ఆదరణ ఎన్టీఆర్ కి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. దాంతో ఆయన మరింత ఉత్సాహంతో 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో వక్కంతం వంశీ సినిమాకి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు వక్కంతం వంశీ కథలను అందించాడు. ఆ తరువాత ఎన్టీఆర్ కి ఒక కథను రెడీ చేసిన ఆయన, తానే దర్శకుడిగా వ్యవహరించాలనే ఆలోచనలో వున్నాడు.

వక్కంతం వంశీ వినిపించిన కథ నచ్చిందని ఎన్టీఆర్ చెప్పి కొంతకాలం అవుతున్నప్పటికీ, కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల పూరీ సినిమాకి ఎన్టీఆర్ ఓకే చెప్పాడనే వార్త బయటికి రావడంతో, వక్కంతంతో చేసే సినిమా మరింత ఆలస్యం కావొచ్చని అనుకున్నారు. కానీ పూరీతో సినిమానే వాయిదా వేసుకుని, వక్కంతంతో చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడట. 'జనతా గ్యారేజ్' తరువాత ఈ సినిమాయే పట్టాలెక్కనుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ దీనిని నిర్మిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)