ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెయిన్ విలన్ గా జగపతిబాబు

Sat, Mar 12, 2016
జగపతిబాబు
జగపతిబాబు
విలన్ గా జగపతిబాబు కెరియర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా శ్రీమంతుడు .. నాన్నకు ప్రేమతో సినిమాల్లో జగపతిబాబు పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు, ఆయనకి మరింత డిమాండ్ ను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుతో పాటుగా కన్నడ .. మలయాళ .. తమిళ సినిమాల్లో బిజీ అవుతున్నారు. అలా ఆయన తాజాగా విజయ్ సినిమాకి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

కోలీవుడ్ అగ్రకథానాయకులలో విజయ్ కి ఎంతో క్రేజ్ వుంది. మొదటి నుంచి దూకుడు చూపిస్తూ వచ్చిన ఆయన, 60వ సినిమాకి చేరుకున్నాడు. ఆయన నటించే 60వ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. భరతన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా పలువురి పేర్లను పరిశీలించిన మీదట, పవర్ ఫుల్ గా వుండే ఈ పాత్రకి జగపతిబాబు సరిగ్గా సరిపోతాడని భావించి ఆయనని ఓకే చేశారట. మే నెలలో ఈ సినిమాను లాంచ్ చేసి, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)