ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ స్టార్ హీరోతో పూరీ సినిమా!

Fri, Mar 11, 2016
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్
జయాపజయాలకు అతీతంగా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లే దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కనిపిస్తాడు. ఆయన ఎప్పుడు కథలు రెడీ చేసుకుంటాడో .. ఎప్పుడు సంభాషణలు సమకూర్చుకుంటాడో తెలియదుగానీ, ఒక దాని తరువాత ఒకటిగా సినిమాలు సెట్స్ పైకి వచ్చేస్తుంటాయి. కథ చెప్పి ఎంతటి హీరోనైనా వెంటనే ఒప్పించడంలో ఆయన సిద్ధహస్తుడు. కనుకనే తాజాగా బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ ను కూడా ఒప్పించాడు. పూరీయే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.

ఇటీవల తాను సంజయ్ దత్ కి ఒక కథను వినిపించాననీ, ఆ కథ ఆయనకి బాగా నచ్చిందని అన్నాడు. 'రోగ్' సినిమా తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుందని ఆయన చెప్పాడు. 'రోగ్' సినిమా తరువాత ఆయన కల్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడనే టాక్ ఈ మధ్య వినిపించింది. ఇప్పుడేమో ఆయన సంజయ్ దత్ సినిమా చేయనున్నట్టు చెప్పాడు. మరి కల్యాణ్ రామ్ సినిమా సంగతి ఏమిటో!
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)