ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లాభాలు తెచ్చిపెట్టిన 'క్షణం'

Fri, Mar 11, 2016
'క్షణం' లో అనసూయ
'క్షణం' లో అనసూయ
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'క్షణం' కూడా చేరిపోయింది. దాదాపు కోటి రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పారు. బడ్జెట్ పరంగా చిన్నదే అయినా, విడుదలైన ప్రతిచోటా భారీ వసూళ్లను సాధించింది. అదలా ఉంచితే .. శాటిలైట్ రైట్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

ప్రముఖ టీవీ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను 1.75 కోట్లకు సొంతం చేసుకున్నారు. సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువగా శాటిలైట్ రైట్స్ పలకడం, హాట్ టాపిక్ గా మారింది. కథ .. కథనాలు .. చిత్రీకరణ ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని సాధించి పెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హిందీలోను ఈ సినిమాను రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)