ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆర్పీ పట్నాయక్ సక్సెస్ సాధించేనా?

Fri, Mar 11, 2016
ఆర్పీ పట్నాయక్
ఆర్పీ పట్నాయక్
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు .. ఆర్పీ పట్నాయక్. సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా ఆయన అందరి మనసులను దోచాడు. 'శ్రీను వాసంతి లక్ష్మీ' అనే సినిమాలో నటించి నటుడిగా కూడా తానేమిటనేది ఆయన నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన 'తులసీదళం' అనే సినిమాతో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో ఆయన ప్రధానమైన పాత్రను పోషించాడు. తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ సంగీతాన్ని కూడా సమకూర్చాడు. ఇలా ఒకేసారి ఆయన నాలుగు బాధ్యతలను నిర్వహించడం విశేషం. హారర్ నేపథ్యంతో కూడిన ప్రేమకథతో ఈ సినిమా కొనసాగుతుంది. వైవిధ్య భరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, విజయాన్ని అందిస్తుందనే గట్టి నమ్మకంతో ఆర్పీ పట్నాయక్ వున్నాడు. మరి ఈ సినిమా ఆయనకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)