ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ తో జగపతిబాబు మరోసారి

Fri, Mar 11, 2016
జగపతిబాబు
జగపతిబాబు
ఒకప్పుడు కథానాయకుడుగా ఎడాపెడా సినిమాలు చేసేసిన ప్రముఖ నటుడు జగపతిబాబు, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. యంగ్ హీరోల, సీనియర్ హీరోల సినిమాలలో నెగటివ్ క్యారెక్టర్స్ పోషిస్తూ ఆర్టిస్టుగా తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఆయన చేసిన పాత్రకు కూడా మంచి పేరొచ్చింది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించే మరో సినిమాలో కూడా కీలక పాత్ర చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందే సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించడానికి జగపతిబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మిస్తాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)