ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఘాజీ' షూటింగులో రానా

Thu, Mar 10, 2016
రానా
రానా
'ఘాజీ' చిత్రం నావికాదళ యుద్ధం నేపథ్యంగా రూపొందుతోంది. రానా కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాప్సీ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ వేసిన సబ్ మెరైన్ సెట్లో చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్లో ఈ రోజున రానా జాయిన్ అయ్యాడు.

ముఖ్యమైన పాత్రలకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ తరహా కథాంశంతో తెలుగులో ఇంతవరకూ ఎలాంటి సినిమా రాకపోవడంతో, ఈ సినిమాపై ఆసక్తి .. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక రానాకి గల క్రేజ్ కూడా, ఈ సినిమా కోసం అంతా ఆతృతగా ఎదురుచూసేలా చేస్తోంది. భారీ బడ్జెట్ తో పీవీపీవారు నిర్మిస్తోన్న ఈ సినిమా, మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)