ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆశ పడుతోన్న అలియా భట్!

Thu, Mar 10, 2016
అలియా భట్
అలియా భట్
బాలీవుడ్ కుర్ర హీరోయిన్ గా అలియా భట్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూత్ ను థియేటర్స్ కి రప్పించగలిగే కథానాయికల జాబితాలో ఆమె పేరు ముందువరుసలో కనిపిస్తుంది. అలాంటి అలియా భట్ ఒక దర్శకుడి సినిమాలో నటించాలని ఆశ పడుతోందట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. మణిరత్నం. దర్శకులలో మణిరత్నం ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తాడు. దృశ్యానికి జీవం పోసే ఆయన తీరు, అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటుంది.

ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కోసం ఎదురుచూడని నటీనటులు వుండరు. అలా అలియా కూడా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఆశపడుతోంది. ఆమధ్య 'ఓకే బంగారం' సినిమాలో కథానాయికగా అలియా భట్ కు ఛాన్స్ వచ్చింది. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె ఆ అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. అందుకు ఎంతగానో బాధపడుతోన్న అలియా, మరో అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆమె నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందో .. ఏమో!
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)