ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వైజాగ్ లో త్రివిక్రమ్ మూవీ షూటింగ్!

Wed, Mar 09, 2016
నితిన్
నితిన్
త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ ఆ' సినిమా తెరకెక్కుతోంది. నితిన్ - సమంతా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. ఇటీవలే 'పొల్లాచ్చి'లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుని వచ్చిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లోని జగదాంబ థియేటర్ సమీపంలో జరుగుతోంది. నితిన్ పై ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు.

'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సక్సెస్ తరువాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా కావడంతో, భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరం కావడంతో, నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకి త్రివికమ్ తప్పకుండా హిట్ ఇస్తాడనే నమ్మకంతో వున్నాడు. ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)