ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ కాంబినేషన్ మళ్లీ రెడీ అవుతోంది

Tue, Mar 08, 2016
శర్వానంద్
శర్వానంద్
ఒక కాంబినేషన్లో వచ్చిన సినిమా హిట్ అయితే, అదే కాంబినేషన్లో మరో సినిమా రావడమనేది సహజంగా జరుగుతూ వుంటుంది. అలా క్రాంతిమాధవ్ .. శర్వానంద్ కాంబినేషన్ కూడా రిపీట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల శర్వానంద్ ని కలిసిన క్రాంతిమాధవ్, ఒక లైన్ చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో శర్వానంద్ వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. కాస్త సమయం పట్టినా, ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయడం ఖాయమని చెబుతున్నారు.

బలమైన కథా కథనాలను .. మనసుకి హత్తుకునే సన్నివేశాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడిగా క్రాంతిమాధవ్ కి మంచిపేరు వుంది. ఇక కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడనే క్రేజ్ శర్వానంద్ కి వుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. అదేస్థాయి హిట్ ను ఈ కాంబినేషన్ మళ్లీ అందుకుంటుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)