ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య సినిమాలో జ్యోతిక!

Mon, Mar 07, 2016
జ్యోతిక
జ్యోతిక
సూర్య - జ్యోతిక కలిసి ఒక తమిళం సినిమాలో నటించబోతున్నారట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. తెలుగు .. తమిళం భాషల్లో కథానాయకుడిగా సూర్యకి .. నాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. వివాహమయ్యాక కొంత గ్యాప్ తీసుకుని ఆ మధ్య జ్యోతిక చేసిన '36 వయదినిలే' సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. జ్యోతికకి గల క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించింది.

ఆ తరువాత మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ఆమెకి, దర్శకుడు 'బ్రహ్మ' ఇటీవల ఒక కథ వినిపించాడట. ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. ఇందులో సూర్య కథానాయకుడిగా కనిపించడమే కాదు, ఆయన తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇటీవల సూర్య ఒక సందర్భంలో మాట్లాడుతూ, త్వరలో తాను, జ్యోతిక కలిసి నటిస్తామని చెప్పాడు. అంటే, ఆ సమయం ఇప్పుడు ఇలా వచ్చిందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)