ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిత్యామీనన్ కి ఎక్కువ మార్క్స్ ఇచ్చేశాడు

Sun, Mar 06, 2016
శర్వానంద్
శర్వానంద్
యువ కథానాయకుల్లో శర్వానంద్ ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తాడు. అందుకు కారణం ఆయన ఎంచుకున్న కథలు .. పోషించిన పాత్రలు అని చెప్పవచ్చు. వేగంగా సినిమాలు చేయడం కన్నా .. విభిన్నమైన సినిమాలను మాత్రమే చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఈ రోజు తన పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆదరణ వల్లనే తాను హీరోగా నిలబడగలిగానని చెప్పాడు.

తెలుగు .. తమిళ భాషల్లో ఇంతవరకూ 24 సినిమాలు చేశానని అన్నాడు. ఇక తాను చేయబోయేది 25వ సినిమా అవుతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంతవరకూ తనతో కలిసి నటించిన కథానాయికలలో, నటన పరంగా నిత్యామీనన్ ముందువరుసలో నిలుస్తుందని అన్నాడు. సహజమైన ఆమె అభినయాన్ని అభినందించకుండా ఉండలేమని చెప్పాడు. ప్రస్తుతం ముగ్గురు దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయనీ, వాటిలో ఏది నచ్చితే అది ముందుగా సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)