ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ రీమేక్ దిశగా 'క్షణం'

Sat, Mar 05, 2016
'క్షణం' లో ఓ దృశ్యం
'క్షణం' లో ఓ దృశ్యం
కథ .. కథనం .. చిత్రీకరణ బాగుంటే చాలు, అది చిన్న సినిమాయే అయినా .. ప్రేక్షకులు పెద్ద హిట్ ను అప్పగించేస్తారు. అలా బడ్జెట్ తక్కువే అయినా భారీవసూళ్లు రాబట్టిన సినిమాగా 'క్షణం' కనిపిస్తుంది. అడివి శేష్ .. ఆదా శర్మ .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, క్రితం నెల చివరిలో విడుదలై అనూహ్యమైన విజయాన్ని సాధించింది.

దాంతో ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా అడివి శేష్ చెప్పాడు. తెలుగులో తాను పోషించిన పాత్రను, హిందీలోను తానే చేయబోతున్నానని అన్నాడు. ఇక తెలుగులో ఆదా శర్మ చేసిన రోల్ ను హిందీలో అలియాభట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే అనసూయ ధరించిన పాత్రకి రాధికా ఆప్టే అయితే సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. అడివి శేష్ మాటలను బట్టి .. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ కి సంబంధించిన పూర్తివివరాలు త్వరలో తెలిసే అవకాశం వుందని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)