ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శాటిలైట్ రైట్స్ లోను 'కృష్ణగాడి' జోరు!

Sat, Mar 05, 2016
మెహరీన్ - నాని
మెహరీన్ - నాని
ఈ మధ్య కాలంలో యూత్ కి బాగా కనెక్ట్ అయిన సినిమాల్లో 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' కూడా చోటు సంపాదించుకుంది. నాని - మెహరీన్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి, హను రాఘవపూడి దర్శకుడిగా వ్యవహరించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం పలు టీవీ ఛానల్స్ పోటీ పడ్డాయట.

ఫైనల్ గా 4 కోట్ల రూపాయలను చెల్లించి శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీవారు దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. నాని మొదటి నుంచి కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ .. అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన 'భలే భలే మగాడివోయ్' సినిమా ఆయన క్రేజ్ ను అమాంతంగా పెంచేసింది. ఆ వెంటనే వచ్చిన 'కృష్ణగాడు' కూడా ఆయనకు బంపర్ హిట్ ను అందించాడు. అందువల్లనే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఈ స్థాయిలో పలికాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)