ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మకాం మార్చేస్తోన్న రకుల్!

Sat, Mar 05, 2016
రకుల్
రకుల్
తెలుగులో అగ్రకథానాయకుల సరసన అవకాశాలను అందుకుంటూ రకుల్ దూసుకుపోతోంది. కొన్ని సినిమాలు సెట్స్ పై వుండగా, మరికొన్ని సినిమాలకు ఆమె సైన్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలనే ఆలోచన చేసిందట. ఢిల్లీ నుంచి ఇక్కడికి తరచూ తిరుగుతూ వుండటం వలన సమయం వృథా కావడమే కాకుండా, అలసటగా కూడా ఉంటోందట.

అందువలన హైదరాబాద్ కి షిఫ్ట్ కావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. హైదరాబాద్ - లోటస్ పాండ్ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో ఒక ఇల్లును కొనుగోలు చేయబోతోందని అంటున్నారు. త్వరలోనే ఆ పనిని పూర్తిచేసి, ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేయనుందట. ఇటీవలే రాశిఖన్నా కూడా హైదరాబాద్ లో ఇల్లు కొనేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రకుల్ కూడా హైదరాబాద్ కి తన మకాం మారుస్తుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)