ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

100 ఎకరాల్లో భారీ సెట్!

Sat, Mar 05, 2016
కేథరిన్
కేథరిన్
100 ఎకరాలలో భారీ సెట్ అనగానే ఎవరైనా సరే .. 'బాహుబలి 2' సినిమా కోసమేమోనని అనుకుంటారు. కానీ ఒక తమిళ సినిమా కోసం ఈ భారీ సెట్ వేస్తున్నారు. తమిళంలో ఆర్య - కేథరిన్ నాయకా నాయికలుగా ఒక సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతోన్న ఈ సినిమా, త్వరలో ప్రారంభం కాబోతోంది. అందుకు అవసరమైన భారీ సెట్ ను తమిళనాడు - దిండుగల్ జిల్లా 'తాండికుడి' అనే గ్రామంలో వేస్తున్నారు.

అక్కడి 100 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని ఈ సినిమా షూటింగ్ కోసం ఎంచుకున్నారట. ఈ సెట్ పూర్తికాగానే ఫస్టు షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. షూటింగ్ కోసం ఈ సినిమా టీమ్ 100 ఎకరాల స్థలాన్ని ఎంచుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతగా ఈ సినిమాలో ఏవుందనే విషయంపై అంతా దృష్టి పెట్టారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)