ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Mar 05, 2016
శ్రుతి హాసన్
శ్రుతి హాసన్
* తన తండ్రితో కలసి తాను తొలిసారిగా నటించే చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి జరుగుతుందని అందాలతార శ్రుతి హాసన్ చెప్పింది. తన తండ్రి ఒక లెజండ్ అనీ, ఆయనతో కలసి నటించే సమయంలో నటనకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంటానన్న నమ్మకం వుందని ఈ ముద్దుగుమ్మ చెప్పింది.
* ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని మ్యూజికల్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మొత్తం ఏడు పాటలుంటాయని సమాచారం. రెహ్మాన్ బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. కార్తీ, సాయిపల్లవి (మలయాళ 'ప్రేమమ్' ఫేం) ఇందులో జంటగా నటిస్తారు.
* వెంకటప్రసాద్ దర్శకత్వంలో 'డీల్ విత్ ధనలక్ష్మి' అనే చిత్రం రూపొందుతోంది. మానస్, పూజిత, అంజలి, అర్చన ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 10 నుంచి ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)