ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సోగ్గాడు' 50 డేస్ ట్రైలర్ వదిలాడు!

Thu, Mar 03, 2016
రమ్యకృష్ణ - నాగార్జున
రమ్యకృష్ణ - నాగార్జున
'సోగ్గాడే చిన్నినాయన' సినిమా 50 రోజుల మైలురాయిని క్రాస్ చేయబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లను సాధిస్తూ విజయ కేతనం ఎగరేస్తోంది. ఇటీవలే 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ సినిమా, 50 రోజుల మైలురాయిని దాటడానికి సిద్ధమవుతోంది.

100కి పైగా సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోబోతున్నందుకు, ఈ సినిమా టీమ్ చాలా హ్యాపీగా వుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో శివాలయం నేపథ్యంలో కొనసాగే సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ నాగ్ అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వుంది. 100 రోజులను కూడా పూర్తిచేసుకుంటుందేమోననే ఆసక్తిని పెంచేదిలా వుంది.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)