ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్ దారిలోనే శ్రుతిహాసన్!

Tue, Mar 01, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
ఈ మధ్య కాలంలో కథానాయికలు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇతర భాషల్లో నటించే ఛాన్స్ రావడమే ఆలస్యం అక్కడి భాషపై దృష్టి పెడుతున్నారు. అంతేకాదు తమ గొంతు ఎలా వున్నా తమకి గల క్రేజ్ కారణంగా ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో వున్నారు. అలా తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకునే కథానాయికల జాబితాలో, శ్రుతిహాసన్ కూడా చేరిపోయింది.

మొదట్లో తన గొంతు బాగుండదనే ఉద్దేశంతో శ్రుతిహాసన్ డబ్బింగ్ చెప్పేది కాదట. ఇక ఈ మధ్య తన గొంతును కొత్తగా భావించి ఆదరిస్తారనే నమ్మకంతో తమిళంలో తన పాత్రలకు డబ్బింగ్ చెప్పి సక్సెస్ అయింది. అప్పటి నుంచి తన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట. అందువల్లనే తెలుగులో కూడా తన గొంతు వినిపించడానికి రెడీ అవుతోంది. తన తాజా చిత్రం 'ప్రేమమ్' కి ఆమె డబ్బింగ్ చెబుతోంది. ఇటీవలే 'నాన్నకు ప్రేమతో' సినిమాతో రకుల్ డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టగా, ఆమె దారిలో ప్రయాణం చేస్తూ 'ప్రేమమ్' సినిమా నుంచి శ్రుతిహాసన్ ఆరంభించిందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)