ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కీర్తి సురేశ్ ఆశ నెరవేరుతుందా?

Tue, Mar 01, 2016
కీర్తి సురేశ్
కీర్తి సురేశ్
తెలుగు .. తమిళం భాషల్లో కీర్తి సురేశ్ కి ఎంతో క్రేజ్ వుంది. చాలా తక్కువ గ్యాప్ లో ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఆమెకి సక్సెస్ లు రావడంతో, అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో మూడు .. నాలుగు సినిమాలు చేస్తోన్న ఆమె, తెలుగులోను ఒక్కో సినిమాను ఒప్పుకుంటూ వెళుతోంది.

తన కెరియర్ స్పీడ్ అందుకోవడం పట్ల కీర్తి సురేశ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అగ్రకథానాయకుల సరసన అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయని అంది. అయితే, విజయ్ సినిమాలో తనకి ఛాన్స్ తగిలినట్టుగా ప్రచారం జరుగుతోందనీ, అలాంటిదేమీ లేదని చెప్పింది. ఆయన సరసన అవకాశం లభిస్తే అది సంతోషించదగిన విషయమని అంది. ఇక, తాను కథానాయికగా ఓకే అనిపించుకున్న దగ్గర నుంచి, అజిత్ సరసన నటించాలని ఆశపడుతున్నానని చెప్పింది. ఆ అవకాశం లభిస్తే తాను అదృష్టవంతురాలినని అంది. మరి ఆమె ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)