ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ భలే ట్విస్ట్ ఇచ్చాడట!

Tue, Mar 01, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
దర్శకుడు లింగుస్వామి విషయంలో బన్నీ భలే ట్విస్ట్ ఇచ్చాడనే విషయాన్ని ఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను చెప్పుకుంటున్నారు. గతంలో బన్నీకి లింగుస్వామి ఒక కథ వినిపిస్తే, అది చాలా బాగుందనే అభిప్రాయాన్ని బన్నీ వ్యక్తం చేశాడట. దాంతో 'సరైనోడు' తరువాత తన సినిమా చేయవచ్చనే ఉద్దేశంతో, ప్రస్తుతం తాను చేయాలనుకున్న 'పందెం కోడి' సీక్వెల్ ను లింగుస్వామి ఆపేశాడు. అంతా రెడీ చేసుకున్నాక ఇలా ఆయన ప్రాజెక్టును వదిలి వెళ్లడం పట్ల, నిర్మాతల మండలికి విశాల్ ఫిర్యాదు చేశాడు కూడా.

ఈ నేపథ్యంలో లింగుస్వామికి కాకుండా, తన తదుపరి సినిమా చేసే అవకాశాన్ని విక్రమ్ కుమార్ కి బన్నీ ఇచ్చాడనేది తాజా సమాచారం. గతంలోనే తాను రెడీ చేసిన కథతో బన్నీని విక్రమ్ కుమార్ ఒప్పించడం జరిగింది. 'సరైనోడు' తరువాత ఆయన కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనతో లింగుస్వామి అయోమయంలో పడ్డాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)