ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాటి హీరో పాత్రల్లో విజయ్!

Mon, Feb 29, 2016
విజయ్
విజయ్
తమిళంలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతోన్న విజయ్, మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. అదే పద్ధతిని ఆయన తన 60వ సినిమాలోను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే 59వ సినిమాను పూర్తిచేసిన విజయ్, 60వ సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. భరతన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడట.

గతంలో ఎంజీఆర్ నటించిన 'ఇంగవీటి పిళ్లై' సినిమాకి ఇది రీమేక్ అని చెబుతున్నారు. అమాయకుడైన యువకుడిగాను .. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన యువకుడిగాను ఎంజీఆర్ నటించిన ఆ సినిమా, అప్పట్లో ఘనవిజయాన్ని అందుకుంది. అదే సంస్థ .. అదే కథను అక్కడక్కడా మార్చి విజయ్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతోంది. విజయ్ సరసన కాజల్ .. కీర్తి సురేశ్ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా అలరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)