ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ గా అక్కడా ఎంటరౌతున్నాడు

Mon, Feb 29, 2016
జగపతిబాబు
జగపతిబాబు
హీరోగా ఒక వెలుగు వెలిగిన వారు .. విలన్ గాను అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అరుదైన క్రేజ్ ను అవలీలగా తన సొంతం చేసుకున్న నటుడు జగపతిబాబు. హీరోగా ఆయన తెలుగు సినిమాలకే ప్రాముఖ్యతను ఇచ్చినా, విలన్ గా .. విలక్షణ నటుడిగా ఆయన ఇతర భాషా చిత్రాల్లోనూ బిజీ అవుతున్నాడు. అలా ఆయన 'పులి మురుగన్' అనే మలయాళం సినిమాలోను విలన్ గా నటిస్తున్నాడు.

తెలుగుతో పాటుగా తమిళం .. కన్నడ సినిమాల్లో చేస్తూ వస్తోన్న ఆయనకి, మలయాళంలో నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో హీరో మోహన్ లాల్ ను ఎదుర్కునే విలన్ గా ఆయన కనిపిస్తాడు. ఏప్రిల్ చివరిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత జగపతిబాబు అక్కడ కూడా బిజీ కావడం ఖాయమని అంటున్నారు. ఇటీవల మలయాళం నుంచి తెలుగుకి వచ్చే నటీనటుల సంఖ్య పెరుగుతూ వుంటే, తెలుగు నుంచి జగపతిబాబు మలయాళం ప్రేక్షకుల ముందుకి కూడా వెళుతుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)