ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ ఇష్టపడుతున్న తమిళ చిత్రం

Sun, Feb 28, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్, ఇప్పుడు ఓ తమిళ రీమేక్ పై మనసు పడ్డట్టు వార్తలొస్తున్నాయి. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో అథర్వ, కేథరిన్ జంటగా ఇటీవల వచ్చిన 'కనిథన్' తమిళ చిత్రం తమిళనాట ఘన విజయాన్ని సాధించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ తమిళ చిత్రం బన్నీని బాగా ఆకట్టుకుందట.
దాంతో దీనిని తెలుగులో రీమేక్ చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి 'కత్తి' రీమేక్ చేయనుండడం... ఇంకోపక్క రామ్ చరణ్ 'తని ఒరువన్' చిత్రాన్ని రీమేక్ చేస్తుండడం ... ఇప్పుడు బన్నీ ఈ 'కనిథన్' చిత్రాన్ని ఇష్టపడడం చూస్తుంటే మెగా హీరోలు తమిళ రీమేక్ లపై పడ్డట్టు కనిపిస్తోంది కదూ!
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)