ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రేష్మి ఆశలు ఫలించేనా?

Sat, Feb 27, 2016
రేష్మి
రేష్మి
బుల్లితెరపై సందడి చేస్తూ .. వెండితెరకి పరిచయమైనవారి జాబితాలో రేష్మి గౌతమ్ కూడా కనిపిస్తుంది. కథానాయికకి కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉండటంతో, ఈ అమ్మాయి సినిమాల్లోకి రావడానికి ఎంతో సమయం పట్టదని అనుకున్నారు. అలాగే రేష్మి 'గుంటూరు టాకీస్' సినిమా చేసింది. ఈ సినిమా వచ్చేనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా రేష్మి మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమాలో తాను 'సువర్ణ' అనే పల్లెటూరి పిల్లలా కనిపిస్తానని అంది. ఈ పాత్రను దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎంతో చక్కగా మలిచాడనీ, ఛాలెంజింగ్ గా భావించి చేశానని చెప్పింది. గ్లామర్ డోస్ ఎక్కువైందని అనిపించినా, పాత్రపరంగా సహజమేనని అనిపిస్తుందని అంది. ఈ సినిమాతో తన కెరియర్ స్పీడు అందుకుంటుందని రేష్మి భావిస్తోంది. ఆమె ఆశలను ఈ సినిమా ఎంతవరకూ నిజం చేస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)