ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇకపై గ్లామర్ డోస్ పెంచుతుందట!

Sat, Feb 27, 2016
మెహరీన్
మెహరీన్
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహరీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాలో కథానాయికగా మెరిసిన ఈ సుందరి, యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది. అంతేకాదు కొత్త అవకాశాలను కూడా చకచకా రాబట్టుకుంటోంది. అవసరమైతే గ్లామర్ డోస్ పెంచడానికి కూడా రెడీ అంటోందట.

తెలుగు తెరకి కథానాయికల రాక ఎక్కువనీ, ఇక్కడ పోటీని ఎదుర్కోవాలంటే గ్లామర్ డోస్ పెంచక తప్పదని ఆమె భావిస్తోంది. కథానాయికల నుంచి యూత్ ఎక్కువగా గ్లామర్ నే ఆశిస్తారనీ, ఈ విషయంలో మంచి మార్కులు కొట్టేస్తేనే కెరియర్ స్పీడు అందుకుంటుందని చెబుతోంది. గ్లామర్ విషయంలో మెప్పిస్తూ వెళుతున్నప్పుడే నటనకి అవకాశం వుండే పాత్రలు కూడా దక్కుతాయనీ, అలాంటి పాత్రలతో నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. సో... రానున్న తన చిత్రాల్లో ఆమె మరింత గ్లామర్ ను ఒలకబోయనుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)