ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్పెషల్ సాంగ్స్ గురించి అనసూయ!

Sat, Feb 27, 2016
అనసూయ
అనసూయ
అనసూయ ఇప్పుడు బుల్లితెరపైనే కాదు .. వెండితెరపైనా బిజీ. బుల్లితెరపై యాంకర్ గా మాంచి జోష్ చూపించే ఈ భామ, వెండితెరపై తన గ్లామర్ లుక్ తో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాంటి అనసూయకు స్పెషల్ సాంగ్స్ పట్ల కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. కేవలం పాట ఒక్కటి మాత్రమే అయితే తాను చేయనని చెబుతోంది.

సినిమాలో తనకి ఒక ముఖ్యమైన పాత్ర వుండి .. ఆ పాత్ర లింక్ తో వచ్చే స్పెషల్ సాంగ్ అయితేనే చేయాలని తాను నిర్ణయించుకున్నానని అంటోంది. స్పెషల్ సాంగ్ లో గ్లామర్ చూపించడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుందనీ, మంచి పాత్ర లభిస్తే నటిగా తనని తాను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతోంది. అందువలన ఈ రెండూ కలిసి వుంటే ఓకే అంటోంది. తాను సినిమాల్లో బిజీ అవుతున్న కారణంగా .. బుల్లితెరను వదిలేస్తాననే ప్రచారం జరుగుతోందనీ, తనకి ఇంతటి క్రేజ్ ను తీసుకొచ్చిన బుల్లితెరను ఎప్పటికీ వదలనని స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)