ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుకుమార్ సినిమాపై దిల్ రాజు పట్టు!

Sat, Feb 27, 2016
దిల్ రాజు
దిల్ రాజు
ఇటు కుర్ర హీరోలతోను .. అటు అగ్రహీరోలతోను సినిమాలు చేయడంలో దిల్ రాజు ముందుంటాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కథలను ఆయన ఎంత మాత్రం వదులుకోడు. అలా యూత్ ను కట్టిపడేసే దర్శకులలో మనకి సుకుమార్ ముందువరుసలో కనిపిస్తుంటాడు. అందువలన చరణ్ తో తెరకెక్కించాలని సుకుమార్ అనుకుంటోన్న సినిమాను, తన బ్యానర్లో చేయాలనే ఆలోచనలో దిల్ రాజు వున్నాడట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' బంపర్ హిట్ కొట్టడం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ కి ఒక సినిమా చేసి పెడతానని వాళ్ల దగ్గర సుకుమార్ ఇంతకు ముందే అడ్వాన్స్ తీసుకున్నాడట. అందువలన ఆ బ్యానర్లో ఈ ప్రాజెక్టు చేయాలని సుకుమార్ అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో .. దిల్ రాజు ఈ ప్రాజెక్టు తన బ్యానర్ పై చేయమని సుకుమార్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఇటు చరణ్ ని కూడా ఈ విషయం పై మొహమాట పెడుతున్నాడని చెబుతున్నారు. అదే నిజమైతే ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)