ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రానా మూవీ బడ్జెట్ 70 కోట్లా?

Fri, Feb 26, 2016
రానా
రానా
రానా కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'ఘాజి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సబ్ మెరైన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లట! అనే వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. రానా కెరియర్లో ఆయన హీరోగా ఈ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మొదటి సినిమా ఇదేనని అంటున్నారు.

సాధారణంగా ఈ స్థాయి బడ్జెట్ ను పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు సినిమాలకి కేటాయిస్తుంటారు. అలాంటిది రానా మూవీకి ఖర్చుచేస్తే వర్కౌట్ అవుతుందా? అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే 'బాహుబలి' సినిమా తరువాత రానాకి జాతీయస్థాయిలో క్రేజ్ రావడం వలన, ఈ స్థాయి పెట్టుబడిపై కంగారుపడవలసిన పనిలేదని అంటున్నారు. అంతేకాదు .. ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ .. హిందీ భాషల్లోను తెరకెక్కిస్తున్నందు వలన, ఆ స్థాయి వసూళ్లను రాబట్టడం కష్టమేం కాదని చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే పీవీపీవారు ఈ స్థాయిలో ఖర్చుచేస్తూ ఉండవచ్చని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)