ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ మూవీలో ఛాన్స్ దొరికితే చాలట!

Fri, Feb 26, 2016
దిషా పటాని
దిషా పటాని
అల్లు అర్జున్ కి యూత్ లో వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కొత్త కథానాయికలే కాదు, అగ్రకథానాయికలు సైతం ఆయనతో జోడీ కట్టడానికి ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి అల్లు అర్జున్ మూవీలో తనకి ఛాన్స్ దక్కితే చాలని దిషా పటాని అంటోంది. దిషా పటాని పేరు వినగానే ఇటీవల ఆమె నటించిన 'లోఫర్' సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో, ఈ సుందరిని అంతగా అవకాశాలు పలకరించడం లేదు.

ఈ నేపథ్యంలోనే ఆమె, అల్లు అర్జున్ సినిమాలో కనిపించాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది. తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అనీ .. ఆయన నటన .. డాన్స్ తనకి ఎంతో ఇష్టమని అంది. ఆయన సరసన కథానాయికగా ఛాన్స్ లభిస్తే అంతకు మించిన అదృష్టం లేదని చెప్పింది. ఆయన సినిమాలో ముఖ్యమైన పాత్రను చేయడానికి కూడా తాను సిద్ధమని అంది. ఒకవేళ ఆయన మూవీలో ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం దక్కినా వదులుకోనని చెప్పింది. మరి ఆమె కోరిక నెరవేరుతుందేమో చూడాలి
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)