ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలక్షణ నటుడి కామెడీ చిత్రం!

Fri, Feb 26, 2016
కమలహాసన్
కమలహాసన్
విలక్షణ నటుడు కమలహాసన్ ఏ తరహా సినిమా చేసినా అందులో హాస్యం, వినోదం కచ్చితంగా వుంటాయి. అలాంటి 'కమల్ బ్రాండ్ కామెడీ'కి ఎంతో మంది అభిమానులున్నారు. అందుకే, ఏ సినిమాలోనూ కూడా ఆ తరహా హాస్యాన్ని ఆయన మిస్ కాకుండా చూసుకుంటాడు. అలాంటి కమల్ ఇప్పుడు ఏకంగా పూర్తి కామెడీ చిత్రాన్ని చేయడానికి సమాయత్తమవుతున్నాడు.
హాస్య చిత్రాలకు ఓ సరికొత్త శైలిని ఏర్పరచిన సీనియర్ దర్శకుడు మౌళి దీనికి దర్శకత్వం వహిస్తాడు. 'పరమపథం' పేరిట ఈ చిత్రం రూపొందుతుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని చెన్నయ్ వర్గాల సమాచారం. కాగా, కమల్ మరోపక్క మలయాళ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో 'అప్పా అమ్మా విళయాట్టు' చిత్రంలో నటించడానికి ఇప్పటికే ఓకే చెప్పిన సంగతి తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)