ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ప్రతాపరుద్రుడు' పాత్రలో ప్రభాస్?

Thu, Feb 25, 2016
ప్రభాస్
ప్రభాస్
'ప్రతాపరుద్రుడు' పాత్రలో ప్రభాస్ నటించే అవకాశం ఉందనీ, అయితే అందుకు గుణశేఖర్ కొంతకాలం ఓపికపట్టవలసి ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'రుద్రమదేవి' సినిమా సీక్వెల్ కి రంగాన్ని సిద్ధం చేసేందుకు గుణశేఖర్ పూనుకున్నాడు. ఇందుకోసం తన టీమ్ ను రెడీ చేస్తూనే, 'ప్రతాపరుద్రుడు' జీవితవిశేషాలను పూర్తిస్థాయిలో తెలుసుకునే పనిలో పడ్డాడు.

అలాగే ఈ పాత్రను చేయడానికి భారీ క్రేజ్ గల స్టార్ హీరో అయితే బాగుంటుందని భావించిన ఆయన, ప్రభాస్ ను సంప్రదిస్తున్నాడని అంటున్నారు. ఈ పాత్రకి ఆయనైతేనే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని చెబుతున్నారు. అయితే 'బాహుబలి 2' సినిమా కోసమే ప్రభాస్ ఈ ఏడాదంతా కేటాయించాడు. ఆ తరువాత ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనా .. గోపీకృష్ణ మూవీస్ పైన సినిమాలను చేయనున్నాడు. అందువలన ప్రభాస్ ఓకే చెప్పినా 'ప్రతాపరుద్రుడు' సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం కావొచ్చని అంటున్నారు. ఒకవేళ 'ప్రతాపరుద్రుడు' ప్రాజెక్టుకే ఆయన ప్రాధాన్యతను ఇస్తే మాత్రం, గుణశేఖర్ ఎక్కువకాలం నిరీక్షించవలసిన అవసరం వుండదని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)