ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ రోజు కోసమే శ్రుతిహాసన్ వెయిటింగ్!

Thu, Feb 25, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
జీవితంలో తనకి ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు త్వరలో రాబోతోందనీ, ఆ రోజు కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అందాల కథానాయిక శ్రుతిహాసన్ చెప్పింది. తెలుగు .. తమిళం .. హిందీ భాషల్లో అగ్రకథానాయకుల సరసన కథానాయికగా చోటు దక్కించుకుంటూ శ్రుతిహాసన్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమెకి తన తండ్రి కమలహాసన్ తో కలిసి 'అప్పా అమ్మా విళయాట్టు' అనే తమిళం చిత్రంలో నటించే అవకాశం లభించింది.

దాంతో ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరౌతూ, నిజంగా ఇది ఒక అరుదైన అవకాశమని చెప్పింది. తన తండ్రితో కలిసి నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందనీ, ఆయన కూతురుగానే ఈ సినిమాలో కనిపించనుండటం విశేషమని అంది. గతంలో ఒకసారి ఇలాంటి ఛాన్స్ వచ్చి చివరిలో మిస్సయ్యిందనీ, మరోమారు అలాంటి అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది. తన తండ్రితో కలిసి నటించడం అంత తేలిక కాదనీ, అయినా ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)