ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ తేజ్ జోడీగా మెహరీన్

Tue, Feb 23, 2016
మెహరీన్
మెహరీన్
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో కథానాయికగా మెహరీన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బీవీఎస్ రవి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బీవీఎస్ రవి, 'వాంటెడ్' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో, ఆ తరువాత నుంచి ఆయన రచయితగానే కొనసాగుతూ వస్తున్నాడు.

తాజాగా ఆయన దిల్ రాజు కి ఒక కథ చెప్పగా, దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయననే చేపట్టమని దిల్ రాజు అన్నాడట. దాంతో ఆయన మరోసారి మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కథానాయికగా మెహరీన్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెను ఖాయం చేశారని అంటున్నారు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో యూత్ హృదయాలను దోచుకున్న కారణంగానే ఆమెకి ఈ ఛాన్స్ దక్కిందని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)