ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యూఎస్ లో అదరగొడుతోన్న' కృష్ణగాడు'

Tue, Feb 23, 2016
నాని - మెహరీన్
నాని - మెహరీన్
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం యూఎస్ లో భారీ వసూళ్లను సాధిస్తూ తన సత్తా చాటుతోంది. ఇంతవరకూ అక్కడ 4.82 కోట్లను వసూలు చేసి, అదే వేగంతో దూసుకుపోతోంది. నాని - మెహరీన్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా, ఈ నెల 12 న భారీస్థాయిలో విడుదలైంది. చక్కని కథా కథనాలతో రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువైంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు యూ ఎస్ లోను భారీ వసూళ్లను సాధిస్తోంది. రెండవ వారంలోను అక్కడ ఈ సినిమా అదే స్పీడ్ చూపిస్తూ, ఇంతవరకూ 4.82 కోట్లను రాబట్టింది. గతంలో నాని చేసిన ' భలే భలే మగాడివోయ్' ఆయన కెరియర్లో రికార్డు స్థాయిలో అక్కడ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డుకు దగ్గరలో వుండటం విశేషం. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలుగా వచ్చి, పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోయింది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)