ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకత్వం చేపట్టాలనే ఆలోచనలో నిత్యామీనన్

Tue, Feb 23, 2016
నిత్యామీనన్
నిత్యామీనన్
ఎప్పటికైనా దర్శకత్వం చేపట్టాలనే ఆలోచన తనకు వుందని నిత్యామీనన్ చెప్పింది. దర్శకత్వం అంటే తనకి చాలా ఇష్టమనీ, మనసులోని భావాలను దృశ్యంగా మలచడంలోని ఆనందమే వేరని అంది. తీరిక సమయాల్లో తనకి కథలు రాసే అలవాటు ఉందనీ, అలా చాలా కథలు రాశానని చెప్పింది. ఆ కథలను తెరకెక్కించాలని ఆశగా ఉందనీ, అందుకే దర్శకత్వంలోని మెళకువలను అర్థం చేసుకుంటున్నానని అంది.

షూటింగ్ సమయాల్లో దర్శకులు ఏ షాట్ ని ఎలా చిత్రీకరిస్తున్నది పరిశీలిస్తానని చెప్పింది. ప్రస్తుతం తాను కథానాయికగా బిజీగా వుండటం వలన దర్శకత్వం వైపు వెళ్లడం లేదనీ, తనకి అవకాశాలు తగ్గిన తరువాత మెగాఫోన్ చేతబట్టే ఆలోచన వుందని అంది. తన దర్శకత్వంలో మంచి చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి నిత్యామీనన్ కూడా రేవతి మాదిరిగా మంచి దర్శకురాలు అనిపించుకోనుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)