ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమ్మవారి పాత్రలో రమ్యకృష్ణ

Mon, Feb 22, 2016
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ మరోమారు అమ్మవారి పాత్రలో అలరించనుంది .. అదీ మలయాళ సినిమాలో. 'ఆడుపులి యాట్టామ్' అనే సినిమాలో ఆమె ఇలా దేవత పాత్రను ధరిస్తోంది. గతంలోను రమ్యకృష్ణ అమ్మవారి పాత్రలను ధరించింది. ముఖ్యంగా తెలుగులో అమ్మవారిగా ఆమె కనిపించిన 'అమ్మోరు' సినిమా ఆమె కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. చాలా కాలం తరువాత మళ్లీ ఈ తరహా పాత్రను పోషిస్తోంది.

రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో జయరామ్ .. ఓంపురి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. దుర్మార్గులను అంతం చేయడానికి ఒక దెయ్యానికి దేవత సాయం చేసిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దెయ్యంగా ఒక చిన్న పాప కనిపించే ఈ సినిమాలో, దేవతగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమా తెలుగులోను విడుదల కానుంది. ఈ సినిమా అనువాద హక్కుల కోసం గట్టీ పోటీ ఉన్నప్పటికీ, కె.నిర్మల పెద్ద మొత్తంలో రేటు చెల్లించి ఈ హక్కులను దక్కించుకున్నారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)