ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ తరుణ్ ఆసక్తి చూపడం లేదట!

Sun, Feb 21, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
ఒక హిట్ ఉత్సాహాన్ని పెంచితే .. ఒక ఫ్లాప్ ఆలోచనలో పడేస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్ తరుణ్ అలాంటి ఆలోచనలో పడ్డాడని చెబుతున్నారు. 'లేడీస్ టైలర్' సీక్వెల్ లో చేయడానికి ఆయన ఆసక్తిని చూపకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. రాజ్ తరుణ్ వరుస సినిమాలను అంగీకరిస్తూ .. మూడు హిట్లను సొంతం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన సీనియర్ దర్శకుడు వంశీ సినిమాను కూడా అంగీకరించాడు. గతంలో ఘన విజయాన్ని సాధించిన 'లేడీస్ టైలర్' సినిమాకి సీక్వెల్ గా వంశీ ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈలోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాతో రాజ్ తరుణ్ ను పరాజయం పలకరించింది. దాంతో ఆలోచనలో పడిన ఆయన, కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ' లేడీస్ టైలర్' సినిమా సీక్వెల్ పై ఆసక్తిని చూపడం లేదని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)