ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కృష్ణగాడు' తీసుకొచ్చిన ఛాన్స్!

Sat, Feb 20, 2016
హను రాఘవపూడి
హను రాఘవపూడి
దర్శకుడు హను రాఘవపూడి తన తాజా చిత్రం కోసం ఒక స్టార్ హీరోను ఒప్పించినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ విని ఆ హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన అందుకు సంబంధించిన పనుల్లో ఉన్నాడని చెబుతున్నారు. 'అందాల రాక్షసి' సినిమాతో హను రాఘవపూడి పేరు వినిపించింది. టేకింగ్ పరంగా ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత పెద్ద హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.

దాంతో తాను తయారుచేసుకున్న కథకి నానిని కథానాయకుడిగా ఎంచుకుని, 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాను అందించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక స్టార్ హీరోకి కథ వినిపించి, ఓకే అనిపించుకున్నాడని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)