ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనసూయకు అలాంటి పాత్రలు కావాలట!

Sat, Feb 20, 2016
అనసూయ
అనసూయ
నటిగా తన ప్రతిభాపాటవాలను ప్రూవ్ చేసుకుంటానని అనసూయ చెప్పింది. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని అంది. అనసూయ విభిన్నమైన పాత్రను పోషించిన 'క్షణం' సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందని చెప్పింది. ఈ తరహా పాత్రను పోషించడం మొదటిసారే అయినా, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుందని అంది.

బుల్లితెరపైనే కాదు వెండితెరపైన కూడా తనని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారని చెప్పింది. ' సోగ్గాడే చిన్నినాయన' సినిమాలో తాను పోషించిన చిన్నపాత్రను వాళ్లు రిసీవ్ చేసుకున్న తీరే అందుకు నిదర్శనమని అంది. గ్లామర్ పరంగా కన్నా, నటనకి అవకాశం వుండే పాత్రల పట్ల తాను ఎక్కువ ఆసక్తిని చూపుతానని చెప్పింది. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని అంది. మరి ఆ తరహా పాత్రలు ఆమెకి ఎప్పుడు దక్కుతాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)