ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలయ్యను కృష్ణవంశీ అందుకే కలిశాడా?

Sat, Feb 20, 2016
కృష్ణవంశీ
కృష్ణవంశీ
బాలకృష్ణను రెండు మూడు రోజుల క్రితం కృష్ణవంశీ కలవడం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణతో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఆయనని కృష్ణవంశీ కలవడం జరిగిందని అనుకుంటున్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే, ఆయన 100వ సినిమాను గురించిన విశేషాల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బోయపాటితో ఉంటుందా .. సింగీతంతో ఉంటుందా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

ఇంతలో ఆయనకి క్రిష్ కూడా ఒక కథ వినిపించాడనే వార్తలు షికారు చేశాయి. అది చారిత్రక కథాంశంతో కూడిన లైన్ అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణను కృష్ణవంశీ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బాలకృష్ణకి సోషియో ఫాంటసీకి సంబంధించిన ఒక లైన్ చెప్పాడని అంటున్నారు. గతంలో ఆయన ఈ తరహా కథాంశంతో 'శ్రీ ఆంజనేయం' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలాంటి కథాంశంతో కూడిన ఒక సినిమాను రూపొందించే ఆలోచనలో కృష్ణవంశీ ఉన్నాడని చెబుతున్నారు. అదే నిజమైతే త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)