ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

50 డేస్ ను క్రాస్ చేస్తోన్న ' నేను శైలజ'

Fri, Feb 19, 2016
కీర్తి  సురేశ్ - రామ్
కీర్తి సురేశ్ - రామ్
'నేను శైలజ' సినిమా 50 రోజులను పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రామ్ - కీర్తి సురేశ్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. స్రవంతి బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమా, జనవరి 1న విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా, కొన్ని సెంటర్స్ లో 50 రోజులను పూర్తిచేసుకుని శతదినోత్సవం వైపు పరిగెడుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ, ఈ సినిమా తాను అనుకున్నట్టుగా రావడానికి కారణం, నిర్మాత అందించిన సహకారమేనని చెప్పాడు. నటీనటులు .. సాంకేతిక నిపుణుల అంకితభావం కారణంగానే ఈ స్థాయి విజయం సాధ్యమైందని అన్నాడు. కథ .. కథనాలు .. సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరించి ప్రోత్సహించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)