ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభుదేవా సినిమాగా 'పాతాళ భైరవి'?

Thu, Feb 18, 2016
ప్రభుదేవా
ప్రభుదేవా
ప్రభుదేవా తాజా చిత్రం టైటిల్ 'పాతాళ భైరవి' అని తెలుస్తోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషలలోను ఈ టైటిల్ తోనే ఈ సినిమా పలకరించనుందని అంటున్నారు. హిందీలో దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా వున్న ప్రభుదేవా, చాలాకాలం తరువాత తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటించనున్న ఈ సినిమాను, తెలుగు .. హిందీ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాకి ఒక నిర్మాతగా కూడా ప్రభుదేవా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చడమే కాకుండా, సహ నిర్మాతగా కోన వెంకట్ వ్యవహరించనున్నాడనే వార్త బయటికి వచ్చింది. తాజాగా ఈ సినిమాకి 'పాతాళ భైరవి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గీతాంజలి .. శంకరాభరణం తరువాత 'పాతాళభైరవి' సినిమా చేయనున్నట్టు గతంలో కోన వెంకట్ చెప్పాడు. ఆ టైటిల్ ను ఆయన ఇప్పుడు ఈ సినిమాకి వాడుతున్నాడని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)