ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరలక్ష్మి ఆశలు ఫలించాయట!

Wed, Feb 17, 2016
వరలక్ష్మి
వరలక్ష్మి
వరలక్ష్మీ ఆశలు ఫలించాయి .. ఆమె ఎదురుచూసినట్టుగానే అగ్రకథానాయకుల సరసన అవకాశాలు దక్కుతున్నాయి. అందుకు కారణం ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం 'తారై తప్పట్టై' అని చెబుతోంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తమిళ్లో అగ్రకథానాయిక అనిపించుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. అగ్రకథానాయకుల సరసన నటించడానికి ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి బాలా దర్శకత్వంలో 'తారై తప్పట్టై' చిత్రంలో అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో తన పాత్రపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదల తరువాత తనకి అగ్రకథానాయకుల సరసన ఛాన్స్ దొరకడం ఖాయమని అనుకుంది. ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడకపోయినా, ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. మలయాళంలో సూపర్ స్టార్ గా వెలుగొందుతోన్న మమ్ముట్టి సరసన కథానాయికగా ఆమెకి అవకాశం వచ్చింది. అలాగే తమిళంలో అర్జున్ సరసన 'నిపుణన్' సినిమాలోను ఆమెకి ఛాన్స్ తగిలింది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయనీ .. వాటిలో కొన్ని ఓకే చేయవచ్చని చెబుతోంది .. తన ఆశలు ఫలించాయని సంబరపడిపోతోంది.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)