ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ చెప్పిన సీక్రెట్

Wed, Feb 17, 2016
కాజల్
కాజల్
ఎప్పటికప్పుడు తాను కొత్తగా కనిపించడానికి ప్రయత్నించడం వల్లనే అగ్రకథానాయికగా ఇంతకాలం నిలవగలిగానని కాజల్ చెప్పింది. పది సంవత్సరాలకి పైగా తన కెరియర్ కొనసాగుతుండటం గురించి చెబుతూ ఆమె ఈ మాట అంది. తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కాజల్ అగ్రస్థానానికి చేరుకుంది. కొత్త కథానాయికల రాక పెరుగుతూ వున్నా, పోటీకి భయపడకుండా కాజల్ తన పని తాను కూల్ గా చేసుకుపోతోంది. ప్రస్తుతం హిందీలోను తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది

దశాబ్ద కాలం పూర్తయినా తన కెరియర్ జోరు ఎంతమాత్రం తగ్గకపోవడానికి కారణం తాను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నించడమేనని చెప్పింది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ అంకితభావంతో ఆ పాత్రలకి న్యాయంచేస్తూ వచ్చానని చెప్పింది. వృత్తి పట్ల తనకి గల ప్రేమ .. క్రమశిక్షణ తాను ఇంత దూరం ప్రయాణించడానికి కారణమయ్యాయని అంది. అంతే కాకుండా హెయిర్ స్టైల్ విషయంలోను .. వస్త్ర ధారణ విషయంలోను కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చానని చెప్పింది. తనని చూడటంలో ప్రేక్షకులకు బోర్ అనిపించకూడదనే ఉద్దేశంతో, ఆ దిశగా తాను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ తన కెరియర్ ను కాపాడుతూ వచ్చిందని అంది. సక్సెస్ ఫుల్ కథానాయికగా తాను ఇంతకాలం కొనసాగుతూ ఉండటానికి ఇవే ప్రధాన కారణాలని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)