ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ కోసం ట్రై చేస్తోన్న హరీశ్ శంకర్

Wed, Feb 17, 2016
రవితేజ
రవితేజ
రవితేజ కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి దర్శకుడు హరీశ్ శంకర్ రంగంలోకి దిగాడని అంటున్నారు. ముందుగా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్న ఆయన, ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో రవితేజతో ప్లాన్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఎన్టీఆర్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా నిరాశపరిచింది. అయినా హరీశ్ శంకర్ టేకింగ్ నచ్చడంతో, మరో కథను రెడీ చేయమని ఎన్టీఆర్ అన్నాడట. దాంతో కొంత సమయం తీసుకుని హరీశ్ శంకర్ మంచి కథను రెడీ చేసుకున్నాడు.

అయితే ఈ లోగా ఎన్టీఆర్ మరింత బిజీ అయ్యాడు. ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' చేయడానికి రెడీ అవుతున్న ఆయన, ఆ తరువాత పూరీ జగన్నాథ్ సినిమాకి కమిటయ్యాడు. అందువలన ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి మరికొంత సమయం పడుతుందనే విషయం హరీశ్ శంకర్ కి అర్థమైపోయింది. దాంతో అదే కథను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా మార్చి ఆయనతో చేయాలని అనుకుంటున్నాడట. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)