ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ ను మెప్పించిన పూరీ

Wed, Feb 17, 2016
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ తాను రెడీ చేసిన కథతో మరోసారి మహేశ్ బాబును మెప్పించాడు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా పూరీ జగన్నాథ్ ఎంత వేగంగా కథలు రెడీ చేస్తాడో .. అంతే వేగంగా వాటి షూటింగును పూర్తి చేస్తాడు. షూటింగ్ మొదలుపెడుతూనే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు.

అలాగే చక చకా 'లోఫర్' ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, 'రోగ్' ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అంతేకాదు సింగిల్ సిట్టింగ్ లో ఇటు ఎన్టీఆర్ కి .. అటు కల్యాణ్ రామ్ కి కథలు వినిపించి, వాళ్లతో ఓకే అనిపించుకున్నాడు.

ఇక తాజాగా ఆయన మహేశ్ బాబుకి కూడా ఒక కథ వినిపించి ఆయనతోను ఓకే చెప్పించాడట. యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంతో ఆయన సిద్ధం చేసిన కథ నచ్చడంతో మహేశ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. గతంలో పోకిరి .. బిజినెస్ మేన్ వంటి రెండు హిట్స్ ను పూరీ ఇవ్వడం వలన కూడా మహేశ్ వెంటనే ఓకే చెప్పి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)