ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలయ్య ఫ్యాన్స్ కి బాగా నచ్చిందట!

Wed, Feb 17, 2016
బాలకృష్ణ
బాలకృష్ణ
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాను చూసి తన ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ బాలకృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా స్పెషల్ షో చూసిన అనంతరం ఆయన ఈ మాట అన్నారు. నాని కథానాయకుడిగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో కథానాయకుడు బాలకృష్ణ వీరాభిమాని కావడంతో, కథలో ఆ పాత్ర ఎలా వుంటుందో తెలుసుకోవడానికి బాలకృష్ణ ఉత్సాహాన్ని చూపించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేకంగా వేసిన షో ను ఆయన చూశారు. ఒక మంచి సినిమాను తీశారంటూ నిర్మాతలను ఆయన అభినందించారు. దర్శకుడు హను రాఘవపూడి కథను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించాడని అన్నారు. నాని చాలా బాగా నటించాడనీ .. కామెడీ బాగా పండిందని చెప్పారు. ఈ సినిమాను చూసి తన అభిమానులంతా ఎంజాయ్ చేస్తున్నారంటూ, ఈ సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)